Top 5 Entertainment Updates Latest Movies TV News From ABP News October 11th | చైతన్య టాటూ తీసేసిన సమంత, ‘యానిమల్’ ఫస్ట్ సాంగ్

ఒంటిపై చైతన్య పేరును చెరిపేసిన సమంత
ఇప్పుడు సమంత (Samantha) జీవితంలో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) లేరు. ఆయన జీవితంలో ఆమె లేరు. వైవాహిక బంధం నుంచి వేరు పడినప్పుడు… తోడుగా మనిషి లేనప్పుడు… పేరు మాత్రం ఎందుకు అనుకున్నారో ఏమో!? తన ఇంటిపై చైతన్య పేరును సమంత చెరిపేశారు. ఎక్కడ? ఏమైంది? అని తెలుసుకోవాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్ళాలి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

రణ్​బీర్, రష్మికల రొమాన్స్ నెక్స్ట్ లెవెల్.. అర్జున్ రెడ్డిని మరపించేలా ‘యానిమల్’ ఫస్ట్ సాంగ్
బాలీవుడ్​లో మోస్ట్ అవైటెడ్ ఫిలింగా రాబోతున్న ‘యానిమల్'(Animal) నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ‘అమ్మాయి’ అంటూ సాగే ఈ పాట ఫుల్ వీడియోని రిలీజ్ చేసి మేకర్స్ సినీ లవర్స్​కి బిగ్ సర్​ప్రైజ్ ఇచ్చారు. సహజంగా కొత్త సినిమాల నుంచి మేకర్స్ లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేస్తారు. కానీ ‘యానిమల్’ మేకర్స్ మాత్రం కాస్త డిఫరెంట్​గా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసేశారు. ‘అర్జున్ రెడ్డి’ మూవీతో సెన్సేషనల్ డైరెక్టర్​గా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘యానిమల్’ మూవీ తెరకెక్కుతోంది. బాలీవుడ్ అగ్ర హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

నవంబర్‌లో ‘వ్యూహం’, జనవరిలో ‘శపథం’ – రెండు పార్టులుగా వర్మ తీస్తున్న జగన్ బయోపిక్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం, ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా ‘వ్యూహం’. ఈ సినిమాను వచ్చే నెలలో విడుదల చేస్తున్నట్లు వర్మ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగరా మోగింది. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల తేదీకి 20 రోజుల ముందు వర్మ తన సినిమా విడుదల చేస్తున్నారు. నవంబర్ 10న ‘వ్యూహం’ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా తెలంగాణలో కంటే ఏపీ ఎన్నికల్లో ఎక్కువ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏపీలో రాజకీయ నాయకులు, విశ్లేషకులు సైతం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ప్రభాస్ ‘కల్కి’లో అమితాబ్ బచ్చన్ లుక్ చూశారా? 
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా రూపొందుతున్న టైమ్ ట్రావెల్ ఫిల్మ్ ‘కల్కి’ (Kalki 2898 AD Movie). ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్న సంగతి ప్రేక్షకులకు తెలుసు. ఈ రోజు అమితాబ్ పుట్టిన రోజు సందర్భంగా సినిమాలో ఆయన లుక్ విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

శ్రీలీలకి ఉన్నంత క్లారిటీ నాకు లేదు – ఈ జనరేషన్ హీరోయిన్స్ ఆమెలా ఉంటే బాగుంటుంది, కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీ లీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘భగవంత్ కేసరి'(Bhagavanth Kesari) మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రిలీజ్ టైం దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే సినిమాపై బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచేస్తుంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ ని అందుకుంది. ఇక తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ అగర్వాల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ చిత్రంలో కాజల్ ‘కాత్యాయని’ అనే పాత్రలో కనిపించనుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

Source link

credite